ఈ బ్లాగును సెర్చ్ చేయండి

12, డిసెంబర్ 2018, బుధవారం

నవగ్రహాలు - క్విజ్ 01


జతపర్చండి

మీ సమాధానాలు కింద comments  లో తెలియపర్చండి. ఉదాహరణ: "a - 4"

a సూర్య కారకత్వములు
b చంద్ర కారకత్వాలు
c కుజ కారకత్వాలు
d బుధ కారకత్వాలు
e గురు కారకత్వాలు
f శుక్ర కారకత్వాలు
g శని కారకత్వాలు
h రాహు కారకత్వాలు
i కేతు కారకత్వాలు

1 ఆయుష్కారకుడు, మారక కారకుడు, అనాచారములు, చర్మ వ్యాధులు, సేవకావృత్తి
2 విద్య, పుత్ర సంతానము, నూతన గృహము, ధనము, వేదాంతము, కీర్తి, భోగ భాగ్యములు
3 తమ్ముడు/చెల్లెలు, ధైర్యం,శారీరక బలం, శక్తి, అసహనం
4 ఆరోగ్యం, అధికారం, ఆకర్షణ, నాయకత్వంఅహంకారం, మోసపూరిత సామర్థ్యం
5 మనోభావాలు, భావోద్వేగాలు, కోరికలు, కల్పన, తల్లి ప్రేమ
6 మోక్ష కారకుడు, వేదాంతము, దైవ భక్తి, మోక్షము, ఆధ్యాత్మిక జ్ఞానము
7 సంతానము, హూణ విద్య, క్షుద్ర దేవతోపాసన, తీర్ధ యాత్రలు, మంత్ర శాస్త్రము, జూదము
8 వివాహము, కళత్రము, వాహనము, గృహము,లలితకళలు, కీర్తి
9 వ్యాపారము, గణితము, జ్యోతిషము, క్రయవిక్రయ కౌశలము, తంత్ర, మంత్ర, యంత్ర విద్యలు



11, డిసెంబర్ 2018, మంగళవారం

శనివత్ రాహువు - కుజవత్ కేతువు

రాహువు శనితో సమానుదనియు, కేతువు కుజుడితో సమానుడనియు చెప్పబడుచున్నది. 

నవగ్రహాలు - కేతువు


కేతు ప్రార్ధన
శ్లో|| ఫలాస పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ |
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ||
శ్లో|| కేత్వారిష్టేతు సంప్రాప్తే కేతుపూజాంచ కారయేత్ | 
కేతుధ్యానం ప్రవక్ష్యామి ఙాన పీడోప శాంతయే || 

నామాలు
అవల, శిఖి, ధూమ, ధ్వజ, మృత్యు పుత్ర 

కేతు కారకత్వాలు
మోక్ష కారకుడు, వేదాంతము, దైవ భక్తి, మోక్షము, పితామహుడు, మంత్ర శాస్త్రము, వైద్య శాస్త్రము, ఆధ్యాత్మిక జ్ఞానము, బ్రహ్మ విద్య, వ్రణములు, చర్మ వ్యాధులు, నేత్ర రోగములు, శతృ భయము, చపల స్వభావము, మితముగా మాట్లాడుత, మౌనముగా ఉండుతూ, వైద్య వృత్తి, స్ఫోటకము, విచిత్ర వస్తువులు, విచిత్ర కార్యములు, సన్యాసము, బ్రహ్మచర్యము, విచిత్ర రోగములు, పిశాచ బాధ, గ్రహపీడ, కృతజ్ఞత, జాతి

ముఖ్య విషయములు
దేవత గణేశ
అవతారము మీనావతారము
వైదిక శాస్త్రం యొక్క మూడు శాఖలు ఆయుర్వేదం, ఉపనిషత్తు, అరణ్యకము
పదవి భటుడు
కులం మిశ్రమ కులం
కుటుంబ సభ్యత్వము తల్లి యొక్క తండ్రి (తాతయ్య)
మూలకం అగ్ని
దిశ నైరుతి
గుణము తామస
ప్రకృతి పిత్త
శరీర వ్యవస్థ గోళ్లు
శరీర భాగం లైంగిక అవయవాలు
రుచి విచిత్రమైన రుచి
రంగు ధూమ్ర వర్ణం
లోహము ఇనుము, కంచు
రత్నం వైఢూర్యము
పరిపక్వత (ఏ వయసులో పూర్తి ప్రభావము చూపును) 48 వ సంవత్సరం
ప్రవర దక్షిణాభి ముఖం అంతర్వేది దేశాధిపతిం ద్విబాహుం గదాధరం జైమిని గోత్రం రాక్షసనామ సంవత్సరే చైత్ర మాసే కృష్ణపక్షే చతుర్దస్యాయాం ఇందువాసారే రేవతీ నక్షత్రజాతం కర్కాటకరాశి ప్రయుక్తం సింహాసనాసీనం
మండలం ద్వజాకార
స్వరాశి
ఉచ్చ వృశ్చికం 
పరమోఛ్ఛ 20 ° వృశ్చికం 
నీచ వృషభం
పరమ నీచ 20 ° వృషభం
మూలత్రికోణం

నవగ్రహాలు - రాహువు


రాహు ప్రార్ధన
శ్లో|| అర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనమ్ |
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ||
శ్లో|| రాహ్వారిష్టేతు సంప్రాప్తే రాహుపూజాంచ కారయేత్ | 
రాహుధ్యానం ప్రవక్ష్యామి చక్షుపీడోప శాంతయే || 

నామాలు
రాహు, విధుంతుదుడు, సింహము, సైంహికేయుడు

రాహు కారకత్వాలు
సంతానము, మాతామహుడు, హూణ విద్య, వైద్య విద్య, క్షుద్ర దేవతోపాసన, తీర్ధ యాత్రలు, సహోదర నష్టము, సహోదర కలహము,  తటాకము, ఆరామము, శూల నొప్పులు, మంత్ర శాస్త్రము, జూదము, నీచ స్వభావము, దుష్టస్త్రీలతో పరిచయము, సదాచారము లేకపోవుట, భూత బాధలు, భూత వైద్యము, అపస్నారము, గ్రహపీడలు, నీచ జీవనము, నేత్ర రోగములు, చెవుడు

ముఖ్య విషయములు
దేవత దుర్గ
అవతారము వరాహవతారము
వైదిక శాస్త్రం యొక్క మూడు శాఖలు అధర్వవేద, జ్యోతిషం, కల్పము
పదవి భటుడు
కులం చండాలుడు
కుటుంబ సభ్యత్వము తండ్రి యొక్క తండ్రి (తాత)
మూలకం వాయు
దిశ నైరుతి
గుణము తామస
ప్రకృతి వాత-కఫ
శరీర వ్యవస్థ జుట్టు
శరీర భాగం విసర్జక అవయవాలు
రుచి వెగటు
రంగు గోధుమ రంగు, బూడిద, ముదురు నీలం
లోహము సీసము
రత్నం గోమేధికము
పరిపక్వత (ఏ వయసులో పూర్తి ప్రభావము చూపును) 42 వ సంవత్సరం
ప్రవర నైరుతిముఖం, శూర్పాసనస్థం చతుర్భుజం, కరాళవక్త్రం ఖడ్గ చర్మధరం, పైఠీనస గోత్రం బర్బరదేశాధిపతిం, రాక్షస నామ సంవత్సరే, భాద్రపద మాసే, కృష్ణ పక్షే, చతుర్దశ్యాం, భానువాసరే హస్తా నక్షత్ర జాతం, సింహరాశి ప్రయుక్తం 
మండలం శూర్పాకార
స్వరాశి
ఉచ్చ వృషభం
పరమోఛ్ఛ 20 ° వృషభం
నీచ వృశ్చికం 
పరమ నీచ 20 ° వృశ్చికం 
మూలత్రికోణం

5, డిసెంబర్ 2018, బుధవారం

నవగ్రహాలు - శని


శని ప్రార్ధన
శ్లో|| నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ |
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ||
శ్లో|| శన్యారిష్టేతు సంప్రాప్తే శనిపూజాంచ కారయేత్ | 
శనిధ్యానం ప్రవక్ష్యామి ప్రాణి పీడోప శాంతయే || 

నామాలు
శనీశ్వర, ఛాయామార్తాండ సంభూత,కర్మఫలదాత, అర, కోన, క్రోద

శని కారకత్వాలు
ఆయుష్కారకుడు, మారక కారకుడు, శరీరశ్రమ అవసరమయ్యే కూలి పనులు, వ్యవసాయము, మట్టితో కూడిన పనులు, వ్యాపారములు, క్రూర స్వభావము, సదాచారము లేకపోవుట, అనాచారములు, చర్మ వ్యాధులు, ఇంజనీరింగు, తామసము, పిరికితనము, దీర్ఘ మనోవిచారములు, పక్షవాతము, మలిన వస్త్రములు ధరించుట, క్షయ, ఉబ్బసము, సమయస్ఫూర్తిగ మాట్లాడలేకపోవుట, దొంగతనము, పాపము, నీచమైన పనులు, నపుంసకత, కారగృహ శిక్ష, అవమానము, పునర్వివాహము, చలిజ్వరములు, మూత్ర వ్యాధులు, దీర్ఘరోగములు, సేవకావృత్తి, వంచన, మోసము, అసత్యవాదము, బహుజన విరోధము, ఇతరులను విమర్శించుట, నలుపు రంగు వస్తువులు.
హూణ (రహస్య) విద్యకు శని రాహు కారకులు

ముఖ్య విషయములు
దేవత శివ, యమ
అవతారము కూర్మావతారం
వైదిక శాస్త్రం యొక్క మూడు శాఖలు స్తపతివేద, యోగ, నిరుక్త
పదవి సేవకుడు
కులం శూద్ర
కుటుంబ సభ్యత్వము తండ్రి, తాతలు
మూలకం వాయు
దిశ పశ్చిమ
గుణము తామస
ప్రకృతి వాత
శరీర వ్యవస్థ మాంసము, కండరము
శరీర భాగం మోకాలు, పిక్కలు, నరములు
రుచి
రంగు ముదురు నీలం, నలుపు
లోహము సీసము, ఇనుము, ఉక్కు
రత్నం నీలం
పరిపక్వత (ఏ వయసులో పూర్తి ప్రభావము చూపును) 36 వ సంవత్సరం
ప్రవర చాపాసనస్థం ప్రత్యజ్ఞ్ముఖం, గృధ్ర రథం, చతుర్భుజం శూలాయుధ ధరం, సౌరాష్ట్ర దేశాదిపతిం, కాశ్యపసగోత్రం ప్రమోదూతసంవత్సరే పౌష్యమాసే కృష్ణ పక్షే అష్టమ్యాం స్వాతి నక్షత్ర జాతం మకర కుంభ రాశ్యాధిపతిం
మండలం ధనురాకార
స్వరాశి మకరం, కుంభం
ఉచ్చ తుల
పరమోఛ్ఛ 20 ° తుల
నీచ మేషం
పరమ నీచ 20 ° మేషం
మూలత్రికోణం  0 ° -20 ° కుంభం



3, డిసెంబర్ 2018, సోమవారం

నవగ్రహాలు - శుక్రుడు


శుక్ర ప్రార్ధన
శ్లో|| హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుమ్ |
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ||
శ్లో|| శుక్రఅరిష్టేతు సంప్రాప్తే శుక్రపూజాంచ కారయేత్ | 
శుక్రధ్యానం ప్రవక్ష్యామి పత్నీ పీడోప శాంతయే || 

నామాలు
శుక్రుడు, ఉశనుడు, భృగు (భృగు పుతృడు)

శుక్ర కారకత్వాలు
వివాహము, కళత్రము, వాహనము, గృహము, , నూతన వస్త్రములు, భోగభాగ్యాలు, సంగీతం, సాహిత్యము, కవిత్వము, నాట్యము, అలంకారములు, స్త్రీసంభోగము, ఆభరణములు, లక్ష్మీభక్తి, చాతుర్యము, లలితకళలు, చిత్రలేఖనము, వ్యాజ్యములు, వీణ, కళనైపుణ్యము, నేత్రము, సత్యవాక్పరిపాలన, హాస్యము, రాజ్యము, అధికారము, ఉన్నతపదవులు, గోభక్తి, సుకుమారము, జ్యోతిష శాస్త్రము, కీర్తి, క్రయవిక్రయములు, అహంభావము, గర్వము, చిత్రకళలు, ఇంజనీరింగు, స్త్రీశ్వేతస్రావ అనారోగ్యము, క్షయ, శ్వాసకోశ సంబంధిత రోగములు

ముఖ్య విషయములు
దేవత ఇంద్రాణి, లక్ష్మి
అవతారము పరశురామ అవతారము
వైదిక శాస్త్రం యొక్క మూడు శాఖలు గంధర్వవేద, చంధస్సు, ఇతిహాసము
పదవి మంత్రి
కులం బ్రాహ్మణ
కుటుంబ సభ్యత్వము భార్య, భర్త
మూలకం జల
దిశ ఆగ్నేయ
గుణము రాజసము
ప్రకృతి కఫ-వాత
శరీర వ్యవస్థ వీర్యము
శరీర భాగం మొహము, మెడ, మర్మాంగములు
రుచి
రంగు ప్రకాశవంతమైన తెలుపు, రంగురంగులు
లోహము వెండి, ప్లాటినం
రత్నం వజ్రము
పరిపక్వత (ఏ వయసులో పూర్తి ప్రభావము చూపును) 25 వ సంవత్సరం
ప్రవర పూర్వాభిముఖం, పద్మాసనస్థం, చతుర్భుజం దండాక్షమాల జటావల్కల థారిణం, కాంభోజ దేశాధిపతి, భార్గవస గోత్రం, పార్ధివ సంవత్సరే శ్రావణమాసే శుక్లపక్షే, అష్టమ్యాం భృగువాసరే, స్వాతీ నక్షత్ర జాతం తులా వృషభ రాశ్యాది పతిం 
మండలం పంచకోనాకార
స్వరాశి తుల, వృషభం
ఉచ్చ మీనం
పరమోఛ్ఛ 27 ° మీనరాశి
నీచ కన్య
పరమ నీచ 27 ° కన్య
మూలత్రికోణం 0 ° -15 ° తుల


1, డిసెంబర్ 2018, శనివారం

నవగ్రహాలు - బృహస్పతి


గురు ప్రార్ధన
శ్లో|| దేవానాం చ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభమ్ |
బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ||
శ్లో|| గురుఅరిష్టేతు సంప్రాప్తే గురుపూజాంచ కారయేత్ | 
గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్ర పీడోప శాంతయే || 

నామాలు
బృహస్పతి, బ్రాహ్మణస్పతి, గురువు, దెవగురు,  ఆంగీరసుడు, ఇజ్యుడు, గీష్పతి, వాచస్పతి

గురు కారకత్వాలు
విద్య, పుత్ర సంతానము, నూతన గృహము, ధనము, వేదాంతము, కీర్తి, భోగ భాగ్యములు, తపస్సు, కవిత్వము, మేధాశక్తి, మంచి స్వభావము, దైవ భక్తి, శీలము, సదాచారము, సమృద్ధి, సంస్కృత భాష, హృదయము, మోకాళ్ళు, ధర్మ గుణము, సౌమ్య దేవతారాధన, అధ్యాత్మిక జ్ఞానము, మీమాంస శాస్త్రము, రాజసన్మానము, సభాపూజ్యత, మంత్రోపాసన, బంధుప్రీతి, సన్నిపాత జ్వరము, దంత వ్యాధులు, నేత్ర రోగములు, ప్రజాభిమానము పొందుట, తీర్ధ యాత్రలు, గురుభక్తి, పితృభక్తి, పౌత్రులు,జ్యోతిష శాస్త్రము, అధికారము, రాజకీయములు, మధుమేహము, శ్లెష రోగములు, చర్మ వ్యాధులు, సత్ప్రవర్తన, మతసంబంధ విషయములపై ఆసక్తి

ముఖ్య విషయములు
దేవత ఇంద్ర
అవతారము వామన అవతరము
వైదిక శాస్త్రం యొక్క మూడు శాఖలు వ్యాకరణ, బ్రాహ్మణ, ప్రతిశఖ్య
పదవి మంత్రి
కులం బ్రాహ్మణ
కుటుంబ సభ్యత్వము పెద్ద సోదరుడు, సంతానం
మూలకం ఆకాశము
దిశ ఈశాన్యం
గుణము సత్వ
ప్రకృతి కఫ
శరీర వ్యవస్థ కొవ్వు
శరీర భాగం కాలేయం, తొడలు, పాదాలు, చెవులు
రుచి తీపి
రంగు పసుపు
లోహము బంగారం
రత్నం కనకపుష్యరాగం
పరిపక్వత (ఏ వయసులో పూర్తి ప్రభావము చూపును) 16 వ సంవత్సరం
ప్రవర పూర్వాభిముఖం, పద్మాసనస్థం, చతుర్భుజం, దండాక్షమాలా ధారిణం, సింధుద్వీప దేశాధి పతిం, అంగీరస గోత్రం, అంగీరస నామ సంవత్సరే వైశాఖమాసే శుక్ల పక్షే ఏకాదశ్యాం గురువాసరే ఉత్తరానక్షత్ర జాతం, ధనుర్మీన రాశ్యాధి పతిం
మండలం దీర్ఘ చతురస్ర
స్వరాశి ధనుస్సు, మీనం
ఉచ్చ కర్కాటకం
పరమోఛ్ఛ 5 ° కర్కాటకం
నీచ మకరం
పరమ నీచ 5 °మకరం
మూలత్రికోణం 0 ° -10 ° ధనుస్సు