ఈ బ్లాగును సెర్చ్ చేయండి

11, డిసెంబర్ 2018, మంగళవారం

నవగ్రహాలు - రాహువు


రాహు ప్రార్ధన
శ్లో|| అర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనమ్ |
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ||
శ్లో|| రాహ్వారిష్టేతు సంప్రాప్తే రాహుపూజాంచ కారయేత్ | 
రాహుధ్యానం ప్రవక్ష్యామి చక్షుపీడోప శాంతయే || 

నామాలు
రాహు, విధుంతుదుడు, సింహము, సైంహికేయుడు

రాహు కారకత్వాలు
సంతానము, మాతామహుడు, హూణ విద్య, వైద్య విద్య, క్షుద్ర దేవతోపాసన, తీర్ధ యాత్రలు, సహోదర నష్టము, సహోదర కలహము,  తటాకము, ఆరామము, శూల నొప్పులు, మంత్ర శాస్త్రము, జూదము, నీచ స్వభావము, దుష్టస్త్రీలతో పరిచయము, సదాచారము లేకపోవుట, భూత బాధలు, భూత వైద్యము, అపస్నారము, గ్రహపీడలు, నీచ జీవనము, నేత్ర రోగములు, చెవుడు

ముఖ్య విషయములు
దేవత దుర్గ
అవతారము వరాహవతారము
వైదిక శాస్త్రం యొక్క మూడు శాఖలు అధర్వవేద, జ్యోతిషం, కల్పము
పదవి భటుడు
కులం చండాలుడు
కుటుంబ సభ్యత్వము తండ్రి యొక్క తండ్రి (తాత)
మూలకం వాయు
దిశ నైరుతి
గుణము తామస
ప్రకృతి వాత-కఫ
శరీర వ్యవస్థ జుట్టు
శరీర భాగం విసర్జక అవయవాలు
రుచి వెగటు
రంగు గోధుమ రంగు, బూడిద, ముదురు నీలం
లోహము సీసము
రత్నం గోమేధికము
పరిపక్వత (ఏ వయసులో పూర్తి ప్రభావము చూపును) 42 వ సంవత్సరం
ప్రవర నైరుతిముఖం, శూర్పాసనస్థం చతుర్భుజం, కరాళవక్త్రం ఖడ్గ చర్మధరం, పైఠీనస గోత్రం బర్బరదేశాధిపతిం, రాక్షస నామ సంవత్సరే, భాద్రపద మాసే, కృష్ణ పక్షే, చతుర్దశ్యాం, భానువాసరే హస్తా నక్షత్ర జాతం, సింహరాశి ప్రయుక్తం 
మండలం శూర్పాకార
స్వరాశి
ఉచ్చ వృషభం
పరమోఛ్ఛ 20 ° వృషభం
నీచ వృశ్చికం 
పరమ నీచ 20 ° వృశ్చికం 
మూలత్రికోణం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి