ఈ బ్లాగును సెర్చ్ చేయండి

3, డిసెంబర్ 2018, సోమవారం

నవగ్రహాలు - శుక్రుడు


శుక్ర ప్రార్ధన
శ్లో|| హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుమ్ |
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ||
శ్లో|| శుక్రఅరిష్టేతు సంప్రాప్తే శుక్రపూజాంచ కారయేత్ | 
శుక్రధ్యానం ప్రవక్ష్యామి పత్నీ పీడోప శాంతయే || 

నామాలు
శుక్రుడు, ఉశనుడు, భృగు (భృగు పుతృడు)

శుక్ర కారకత్వాలు
వివాహము, కళత్రము, వాహనము, గృహము, , నూతన వస్త్రములు, భోగభాగ్యాలు, సంగీతం, సాహిత్యము, కవిత్వము, నాట్యము, అలంకారములు, స్త్రీసంభోగము, ఆభరణములు, లక్ష్మీభక్తి, చాతుర్యము, లలితకళలు, చిత్రలేఖనము, వ్యాజ్యములు, వీణ, కళనైపుణ్యము, నేత్రము, సత్యవాక్పరిపాలన, హాస్యము, రాజ్యము, అధికారము, ఉన్నతపదవులు, గోభక్తి, సుకుమారము, జ్యోతిష శాస్త్రము, కీర్తి, క్రయవిక్రయములు, అహంభావము, గర్వము, చిత్రకళలు, ఇంజనీరింగు, స్త్రీశ్వేతస్రావ అనారోగ్యము, క్షయ, శ్వాసకోశ సంబంధిత రోగములు

ముఖ్య విషయములు
దేవత ఇంద్రాణి, లక్ష్మి
అవతారము పరశురామ అవతారము
వైదిక శాస్త్రం యొక్క మూడు శాఖలు గంధర్వవేద, చంధస్సు, ఇతిహాసము
పదవి మంత్రి
కులం బ్రాహ్మణ
కుటుంబ సభ్యత్వము భార్య, భర్త
మూలకం జల
దిశ ఆగ్నేయ
గుణము రాజసము
ప్రకృతి కఫ-వాత
శరీర వ్యవస్థ వీర్యము
శరీర భాగం మొహము, మెడ, మర్మాంగములు
రుచి
రంగు ప్రకాశవంతమైన తెలుపు, రంగురంగులు
లోహము వెండి, ప్లాటినం
రత్నం వజ్రము
పరిపక్వత (ఏ వయసులో పూర్తి ప్రభావము చూపును) 25 వ సంవత్సరం
ప్రవర పూర్వాభిముఖం, పద్మాసనస్థం, చతుర్భుజం దండాక్షమాల జటావల్కల థారిణం, కాంభోజ దేశాధిపతి, భార్గవస గోత్రం, పార్ధివ సంవత్సరే శ్రావణమాసే శుక్లపక్షే, అష్టమ్యాం భృగువాసరే, స్వాతీ నక్షత్ర జాతం తులా వృషభ రాశ్యాది పతిం 
మండలం పంచకోనాకార
స్వరాశి తుల, వృషభం
ఉచ్చ మీనం
పరమోఛ్ఛ 27 ° మీనరాశి
నీచ కన్య
పరమ నీచ 27 ° కన్య
మూలత్రికోణం 0 ° -15 ° తుల


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి