ఈ బ్లాగును సెర్చ్ చేయండి

5, డిసెంబర్ 2018, బుధవారం

నవగ్రహాలు - శని


శని ప్రార్ధన
శ్లో|| నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ |
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ||
శ్లో|| శన్యారిష్టేతు సంప్రాప్తే శనిపూజాంచ కారయేత్ | 
శనిధ్యానం ప్రవక్ష్యామి ప్రాణి పీడోప శాంతయే || 

నామాలు
శనీశ్వర, ఛాయామార్తాండ సంభూత,కర్మఫలదాత, అర, కోన, క్రోద

శని కారకత్వాలు
ఆయుష్కారకుడు, మారక కారకుడు, శరీరశ్రమ అవసరమయ్యే కూలి పనులు, వ్యవసాయము, మట్టితో కూడిన పనులు, వ్యాపారములు, క్రూర స్వభావము, సదాచారము లేకపోవుట, అనాచారములు, చర్మ వ్యాధులు, ఇంజనీరింగు, తామసము, పిరికితనము, దీర్ఘ మనోవిచారములు, పక్షవాతము, మలిన వస్త్రములు ధరించుట, క్షయ, ఉబ్బసము, సమయస్ఫూర్తిగ మాట్లాడలేకపోవుట, దొంగతనము, పాపము, నీచమైన పనులు, నపుంసకత, కారగృహ శిక్ష, అవమానము, పునర్వివాహము, చలిజ్వరములు, మూత్ర వ్యాధులు, దీర్ఘరోగములు, సేవకావృత్తి, వంచన, మోసము, అసత్యవాదము, బహుజన విరోధము, ఇతరులను విమర్శించుట, నలుపు రంగు వస్తువులు.
హూణ (రహస్య) విద్యకు శని రాహు కారకులు

ముఖ్య విషయములు
దేవత శివ, యమ
అవతారము కూర్మావతారం
వైదిక శాస్త్రం యొక్క మూడు శాఖలు స్తపతివేద, యోగ, నిరుక్త
పదవి సేవకుడు
కులం శూద్ర
కుటుంబ సభ్యత్వము తండ్రి, తాతలు
మూలకం వాయు
దిశ పశ్చిమ
గుణము తామస
ప్రకృతి వాత
శరీర వ్యవస్థ మాంసము, కండరము
శరీర భాగం మోకాలు, పిక్కలు, నరములు
రుచి
రంగు ముదురు నీలం, నలుపు
లోహము సీసము, ఇనుము, ఉక్కు
రత్నం నీలం
పరిపక్వత (ఏ వయసులో పూర్తి ప్రభావము చూపును) 36 వ సంవత్సరం
ప్రవర చాపాసనస్థం ప్రత్యజ్ఞ్ముఖం, గృధ్ర రథం, చతుర్భుజం శూలాయుధ ధరం, సౌరాష్ట్ర దేశాదిపతిం, కాశ్యపసగోత్రం ప్రమోదూతసంవత్సరే పౌష్యమాసే కృష్ణ పక్షే అష్టమ్యాం స్వాతి నక్షత్ర జాతం మకర కుంభ రాశ్యాధిపతిం
మండలం ధనురాకార
స్వరాశి మకరం, కుంభం
ఉచ్చ తుల
పరమోఛ్ఛ 20 ° తుల
నీచ మేషం
పరమ నీచ 20 ° మేషం
మూలత్రికోణం  0 ° -20 ° కుంభం



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి