ఈ బ్లాగును సెర్చ్ చేయండి

30, నవంబర్ 2018, శుక్రవారం

నవగ్రహాలు - బుధుడు


బుధ ప్రార్ధన
శ్లో|| ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ |
సౌమ్యం సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ||

శ్లో|| బుధఅరిష్టేతు సంప్రాప్తే బుధపూజాంచ కారయేత్ | 
బుధధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోప శాంతయే || 

నామాలు
సౌమ్య, రౌహినీయ, తుంగ

బుధ కారకత్వాలు
వ్యాపారము, గణితము, హాస్యముగ మాట్లాడె నైపుణ్యము, జ్యోతిషము, వైద్యము, శిల్ప శాస్త్రము, శాస్త్ర పరిశొధనలు, క్రయవిక్రయ కౌశలము, తాత (తల్లి యొక్క తండ్రి), తీర్ధ యాత్రలు, వ్యాకరణము, విష్ణు ఉపాసన, తంత్ర, మంత్ర, యంత్ర విద్యలు, సన్నిపాత జ్వరము, మధుమేహము, మూగ, నపుంసకత్వము, ప్రజ్ఞ, లోక వ్యవహార జ్ఞానము, విద్య, నత్తి, నరములకు సంబంధించిన రోగములు

ముఖ్య విషయములు
దేవత విష్ణు
అవతారము బుద్ధ
వైదిక శాస్త్రం యొక్క మూడు శాఖలు యజుర్వేద, శిక్షా, కర్మ మిమాంస
పదవి యువరాజు
కులం వైశ్య
కుటుంబ సభ్యత్వము తల్లి వైపు బంధువులు, అన్ని రక్త సంబంధాలు
మూలకం భూమి
దిశ ఉత్తరము
గుణము రాజసము
ప్రకృతి వాత-పిత్త-కఫ
శరీర వ్యవస్థ నరాల కణజాలం
శరీర భాగం చర్మము, భుజాలు, చేతులు, శ్వాసకోశ నాళము, ప్రేగులు
రుచి మిశ్రమ
రంగు ఆకుపచ్చ
లోహము పాదరసము, టిన్, మిశ్రమాలు
రత్నం పచ్చ
పరిపక్వత (ఏ వయసులో పూర్తి ప్రభావము చూపును) 32 వ సంవత్సరం
ప్రవర సింహాసనం ఉద్మఙ్ముఖం, మగధదేశాధి పతిం,చతుర్భుజం, ఖడ్గ చర్మాంబరధరం, ఆత్రేయసగోత్రం, అంగీరసనామ సంవత్సరే మార్గ శీర్ష మాసే శుక్లపక్షే సప్తమ్యాం సౌమ్యవాసరే పూర్వాభాద్రా నక్షత్ర జాతం మిథున కన్యారాశ్యధి పతిం
మండలం బాణాకారం
స్వరాశి కన్య, మిధున
ఉచ్చ కన్య
పరమోఛ్ఛ 15° కన్య
నీచ మీనం
పరమ నీచ 15° మీనం
మూలత్రికోణం 16 ° -20 ° కన్య

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి