ఈ బ్లాగును సెర్చ్ చేయండి

26, నవంబర్ 2018, సోమవారం

నవగ్రహాలు - కుజుడు

కుజ ప్రార్థన 
శ్లో || ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం |
కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం ||

శ్లో|| కుజఅరిష్టేతు సంప్రాప్తే కుజపూజాంచ కారయేత్ |
కుజధ్యానం ప్రవక్ష్యామి రోగ పీడోప శాంతయే || 

నామాలు
అంగారక, రక్తవర్ణ. భౌమ, లోహితాంగ, భ

కుజ కారకత్వాలు
ధైర్యం,శారీరక బలం, తమ్ముడు/చెల్లెలు, ప్రమాదకర కార్యకలాపాలు, పోలీసు, సైన్యం, శస్త్రచికిత్స, వ్యభిచారం, కీర్తి, ఇంజనీర్లు, భూములు, అగ్నిమాపకములు, చేతులు, అమ్మకాలు, వ్యవసాయం, శక్తి, అసహనం, ప్రేరేపించుట, ఉత్సాహం, అభిరుచి, మార్గదర్శకత్వం, సాహసం, క్రీడలు, పోటీ, ముక్కుసూటితనము, వనరుల, నిర్వహణ, పరిశోధన, శక్తి, స్వాతంత్ర్యం, చొరవ, ప్రేరణ, నిర్ణయం, ఓర్పు, ధైర్యం, యుద్ధం, ఆయుధాలు, సైనికులు, గాయాలు, ఇంజనీర్లు, దంతవైద్యులు, కాఫీ, పొగాకు, అగ్ని, దహన యంత్రాలు, వంట, ఎడారి, పర్వతాలు, భూమి

ముఖ్య విషయములు
దేవత సుబ్రహ్మణ్య
అవతారము నరసింహ అవతారం (మనిషి-సింహం అవతారం)
వైదిక శాస్త్రం యొక్క మూడు శాఖలు ధనుర్వేదం, న్యాయ, వైశేషిక
పదవి నైనికాధికారి
కులం క్షత్రియ
కుటుంబ సభ్యత్వము చిన్న సోదరులు
మూలకం అగ్ని
దిశ దక్షిణ
గుణము తామస
ప్రకృతి పిత్త
శరీర వ్యవస్థ రక్తం
శరీర భాగం ఎర్రని ఎముక మజ్జ, పిత్తాశయం
రుచి చేదు
రంగు ఎరుపు
లోహము ఇనుము, ఉక్కు, రాగి
రత్నం పగడము
పరిపక్వత (ఏ వయసులో పూర్తి ప్రభావము చూపును) 28 వ సంవత్సరం
ప్రవర మేషవాహనం, దక్షినాభిముఖం, చతుర్భుజం,గదాశూలశక్తి ధరం, అవంతిదేశాధి పతి, భారద్వాజస గోత్ర, రాక్షసనామ సంవత్సరే, ఆషాడ మాసే, శుక్లపక్షే, దశమ్యాం, భౌమవాసరే, అనూరాధా నక్షత్రజాతం, మేష వృశ్చిక రాశ్యధి పతిం
మండలం త్రికోణాకార
స్వరాశి మేష, వృశ్చిక
ఉచ్చ మకరము
పరమోఛ్ఛ 28° మకరము
నీచ కర్కాటకం
పరమ నీచ 28° కర్కాటకం
మూలత్రికోణం 0- 18° మేషము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి